భారతదేశం అంతటా ప్రభుత్వ పథకాలు, సహాయ సేవలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి సమాచారాన్ని పొందేందుకు వికలాంగుల కోసం ఒక వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్ భారత వికలాంగుల సాధికారత శాఖచే రూపొందించబడింది. సమాచారాన్ని ఫోను కాల్ ద్వారా లేదా వాట్స్ ఆప్ ద్వారా పొందవచ్చు.
DIVYA VOICEBOT:
- వికలాంగుల కోసం ప్రభుత్వ పథకాలు, సహాయ సేవలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి DIVYA VOICEBOT అనే AI సర్వీసు ద్వారా ఇవ్వబడిన టోల్ ఫ్రీ నెంబరు: 011-44739626 కు ఫోను చేయటం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.
- ఫోన్ చేసినపుడు మీకు కావలసిన భాషలో సమాచారం ఇవ్వగలరని కోరినచో మీరు ఎంచుకున్న భాషలో సమాచారం ఇవ్వబడుతుంది.
- విద్య, ఉద్యోగం, ఫిర్యాదులు, పధకం సిఫార్సులు, UDID ప్రశ్నలు మరియు హెల్ప్ లైన్ వివరాలు ఇలా అనేక విధాలుగా సమాచారం సేకరించవచ్చు.
- మీరు ఎంచుకున్న సేవను బట్టి మీ యొక్క వైకల్య వివరాలను సేకరించి దానికి అనుగుణంగా సమాచారం తెలియజేయబడుతుంది.
DIVYA CHATBOT:
- వికలాంగుల కోసం ప్రభుత్వ పథకాలు, సహాయ సేవలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి DIVYA CAHTBOT అనే AI సర్వీసు ద్వారా ఇవ్వబడిన నెంబరు: 96466 22622 వాట్స్ ఆప్ కు Hi అను సందేశం పంపించుట ద్వారా కావలిసిన సమాచారాన్ని పొందవచ్చు.
- 10 భాషలు ఈ సర్వీసు నందు అందుబాటులో కలవు. మీరు ఎంచుకున్న భాషలో సమాచారం ఇవ్వబడుతుంది.