Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

భావోద్వేగాలు(Emotions) మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

    గత రెండు రోజుల ముందు వరకు ఒక సందర్భం నన్ను అనేక విధాలుగా భావోద్వేగానికి గురి చేసింది. ఇలా పలు సంధర్భాలలో నేను ఎదుర్కొన్న భావోద్వేగాలను నియంత్రించుకొని ముందుకు వెళ్ళే క్రమంలో అనేక విలువైన పాఠాలను నేర్చుకున్నాను. అనేకులు వారి భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటిని నియత్రించుకోవడంలో వారికి సహాయపడే గైడ్‌ను అందించాలనే ఆలోచనతో ఈ ఆర్టికల్ ప్రారంభించాను. 

    మనమందరం జీవితంలో అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాము. ఈ ఆర్టికల్ వ్రాస్తున్నపుడు, నేను స్వయంగా హెచ్చు తగ్గులను అనుభవించాను. ఆర్టికల్ వ్రాయడం ప్రారంభించగానే నాలో వ్రాయాలనే ఉత్సాహం చాలా త్వరగా తగ్గిపోయింది. అకస్మాత్తుగా నా మనసులో గొప్పగా కనిపించే ఆలోచనలు నీరసంగా అనిపించాయి. నా రచన బోరింగ్‌గా అనిపించింది, అంతేకాదు నాకు దోహదపడటానికి ముఖ్యమైనవి లేదా విలువైనవి ఏవీ లేవని నేను భావించాను. ఆర్టికల్ వ్రాయడం నాకు మరింత సవాలుగా మారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను.

    నా స్వంత భావోద్వేగాలను కూడా నేనే నియంత్రించలేకపోతే భావోద్వేగాల గురించి ఆర్టికల్ వ్రాయడానికి నేను ఎవరు? ఎంత వ్యంగ్యం! నేను ఈ శీర్షిక వ్రాయాలనే ఆలోచన నిలిపివేయాలి అనుకుని ఈ అంశంపై ఇప్పటికే చాలా పుస్తకాలు, వీడియోలు, ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఇంకొకటి కొత్తగా వ్రాయడం ఎందుకు? అని పలు రకాల ప్రశ్నలు నన్ను నిరుత్సాహపరిచాయి కూడా.

నిరుత్సాహం నుండి ఎలా బయటపడ్డాను:

నా భావోద్వేగ సమస్యలపై కృషి చేయడానికి ఈ ఆర్టికల్ ఒక సరైన అవకాశమని నేను గ్రహించి, అప్పుడప్పుడు ప్రతికూల భావోద్వేగాలతో బాధపడని వారు ఎవరు? మనందరికీ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా? మన లోపాలతో మనం ఏమి చేస్తాము అనేది కీలకమని, మనం మన భావోద్వేగాలను అధిగమించి ఎదగడానికి, నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నామా? లేదా వాటితో మనలో మనం ఘర్షణకు గురి అవుతున్నామా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

సరే ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాము.

భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మొదటి అడుగు ఏమిటి?

    మీరు ఏదైనా సంధర్భాలలో భావోద్వేగానికి గురి అయితే మొదటిగా మీరు ఎలా భావిస్తున్నారో మీ గురించి తెలుసుకొని మీతో మీరు మాట్లాడుకోవడం అనేది భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మొదటి అడుగు. మీరు మీ భావాలతో సంబంధాన్ని కోల్పోయారని అంతర్గతీకరించుకోవడానికి చాలా సమయం గడిపి ఉండవచ్చు. భావాలు మీ శరీరంలో శారీరక అనుభూతులుగా వ్యక్తమవుతాయి, మీ మనస్సులోని ఆలోచనగా కాదు. బహుశా, 'అనుభూతి' అనే పదాన్ని తరచుగా అతిగా వాడటానికి లేదా దుర్వినియోగం చేయడానికి కారణం మనం మన భావోద్వేగాల గురించి మాట్లాడకూడదనుకోవడం కావచ్చు.

భావోద్వేగాల గురించి మాట్లాడటం ఎందుకు ముఖ్యం?

మీరు ఎలా భావిస్తారనేది మీ జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. మీ భావోద్వేగాలు మీ జీవితాన్ని దుర్భరంగా లేదా నిజంగా మాయాజాలంగా మార్చగలవు. అందుకే అవి దృష్టి పెట్టవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి. మీకు మంచిగా అనిపించినప్పుడు, ప్రతిదీ మెరుగ్గా కనిపిస్తుంది. మీరు మంచి ఆలోచనలను ఆలోచించడమే కాకుండా మీ యొక్క శక్తి స్థాయిలు ఎక్కువగా ఉండి అవకాశాలు అపరిమితంగా కనిపిస్తాయి. దీనికి విరుద్ధంగా, మీరు నిరాశకు గురైనప్పుడు, ప్రతిదీ నీరసంగా కనిపిస్తూ చాలా తక్కువ శక్తితో మీరు ప్రేరణ లేకుండా ఉంటారు. మీరు ఉండకూడదనుకునే స్థానంలో (మానసికంగా మరియు శారీరకంగా) చిక్కుకున్నట్లు అనిపించి భవిష్యత్తు దిగులుగా కనిపిస్తుంది.

అంతేకాదు సానుకూల దృక్పధంలో భాగంగా మీ భావోద్వేగాలు శక్తివంతమైన మార్గదర్శిగా కూడా పనిచేస్తాయి. అవి మీకు ఏదో తప్పు జరిగిందని చెప్పగలవు, మీ జీవితంలో మార్పులు చేసుకోవడానికి మీకు సహకరిస్తాయి. అందువల్ల, అవి మీ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తిగత వృద్ధి సాధనాలలో ఒకటి.

భావోద్వేగాలను గురించి నాలుగు భాగాలుగా విభజించి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ప్రతీ భాగము యొక్క వివరణ కొరకు ఒక్కొక్క భాగముపై క్లిక్ చేయండి.

భాగము - I: భావోద్వేగాలు అంటే ఏమిటి? మీ మెదడు ప్రతికులతపై ఎందుకు ప్రభావితమవుతుంది ? అహం అంటే ఏమిటి? మన అహం యొక్క బలోపేతానికి కారణాలు ఏమిటి? భావోద్వేగాల స్వభావం గురించి తెలుసుకుంటాము.

భాగము - II: భావోద్వేగాలను నేరుగా ప్రభావితం చేసే విషయాలను మనం పరిశీలిస్తాము. మీ శరీరం, మీ ఆలోచనలు, మీ మాటలు లేదా మీ నిద్ర మీ జీవితంలో పోషించే పాత్రలను, మీ భావోద్వేగాలను మార్చడానికి మీరు వాటిని ఎలా ఉపయోగించవచ్చో మీరు అర్థం చేసుకుంటారు.

భాగము - III: భావోద్వేగాలు ఎలా ఏర్పడతాయి? మరిన్ని సానుకూల భావోద్వేగాలను అనుభవించడానికి మీ మనస్సును ఎలా నియంత్రించాలి?

భాగము - IV:  మీ భావోద్వేగాలను వ్యక్తిగత అభివృద్ధికి ఒక సాధనంగా ఎలా ఉపయోగించాలో మనం చర్చిస్తాము. భయం లేదా నిరాశ వంటి భావోద్వేగాలను మీరు ఎందుకు అనుభవిస్తారో మరియు అవి ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకుంటాము.

4 కామెంట్‌లు: