Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

దివ్యాంగులు UDID కార్డు కొరకు దరఖాస్తు చేసుకొను విధానము

దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం జాతీయ డేటాబేస్‌ను సృష్టించే ఉద్దేశ్యంతో UDID ఉప పథకం అమలు చేయబడుతోంది. దివ్యాంగులు UDID పోర్టల్ నందు క్రింద చూపిన విధముగా దరఖాస్తు చేసుకొనవచ్చును.

స్టెప్ - 1: దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఉన్న UDID వెబ్సైటు పై క్లిక్ చేయండి

https://www.swavlambancard.gov.in/

Fig.1


స్టెప్ - 2: వెబ్సైటులో Apply Now పై క్లిక్ చేయగా వెబ్ పేజీ నందు I have read and understood the process.  
దగ్గర టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.

Fig.2

స్టెప్ - 3: సబ్మిట్ చేసిన పిమ్మట Apply For UDID అను వెబ్ పేజీ నందు కొన్ని ఎంపికలు ఇవ్వబడును. మీ దరఖాస్తుకు తగిన ఎంపికను ఎంచుకొని సబ్మిట్ చేయండి.

Fig.3

Fig.4

స్టెప్ - 4: మీరు ఎంచుకున్న ఎంపికను బట్టి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా మీ పర్సనల్ డీటైల్స్ నమోదు చేయవలెను. మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో jpeg, jpg, png ఫార్మాటులో 5kb - 100 kb వరకు మరియు మీ సంతకము యొక్క ఫోటో jpeg, jpg, png ఫార్మాటులో 3kb - 30 kb వరకు మాత్రమే అప్లోడ్ చేయవలెను.

Fig.5


స్టెప్ - 5:  మీ గుర్తింపు రుజువు డీటైల్స్ మరియు ఉత్తర ప్రత్యుత్తరాల చిరునామా నమోదు చేయవలెను. ఆధార్ కార్డు లేనివారు ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఫోటో ఉన్న రేషన్ కార్డు అప్లోడ్ చేయవచ్చు. 

Fig.6

స్టెప్ - 6:   మీ వైకల్యంకు సంబంధించిన వివరాలు మరియు మీ జిల్లా నందు గల ప్రభుత్వ ఆసుపత్రిని నమోదు చేయండి. పుట్టుకతో వికలాంగులు కానీ పక్షంలో ఏ సంవత్సరము నుండి మీరు వైకల్యం కలిగి ఉన్నారో ఆ సంవత్సరము నమోదు చేయవలెను.

Fig.7

గమనిక: స్టెప్ - 3 Fig.4 నందు చూపిన విధంగా రెండవ ఎంపికను ఎంచుకొనినట్లైతే మీరు కలిగియున్న సదరం వివరాలను క్రింద చూపిన విధముగా నమోదు చేసి, సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలెను. 

చివరిగా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి, దరఖాస్తును సమర్పించండి. 

Fig.8


స్టెప్ - 7: దరఖాస్తును సబ్మిట్ చేసిన తరువాత పూర్తి చేసిన అప్లికేషన్ మరియు ఎన్రోల్మెంట్ నెంబరుతో acknowledgement పిడిఎఫ్ ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేసుకొనవచ్చును. 

స్టెప్ - 8: దరఖాస్తు యొక్క స్థితిని తెలుసుకొనుటకు క్రింద ఉన్న UDID వెబ్సైటు నందు Track Your Application పై క్లిక్ చేయండి. Fig.10 లో చూపిన విధముగా మీ వివరములు నమోదు చేసి దరఖాస్తు యొక్క స్థితిని తెలుసుకొనవచ్చును.


Fig.9


Fig.10


స్టెప్ - 9: మీ దరఖాస్తును సమర్పించిన మోడ్‌ను చూపించినప్పుడు, దరఖాస్తును సమర్పించే సమయంలో ఎంచుకున్న ఆసుపత్రిలోని సంబంధిత UDID/వైకల్య ధృవీకరణ విభాగాన్ని సందర్శించండి. మీ దరఖాస్తును సంబంధిత ఆసుపత్రి లేదా వైద్య అధికారిచే ధృవీకరించుకోండి

స్టెప్ - 10: 
  • మెడికల్ బోర్డుల తనిఖీ ఆధారంగా, సంబంధిత వైద్య అధికారులు మీ UDID కార్డ్ మరియు వైకల్య ధృవీకరణ పత్రాన్ని రూపొందిస్తారు.
  • సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం (DEPwD), స్పీడ్ పోస్ట్ ద్వారా మీ రిజిస్టర్డ్ చిరునామాకు కార్డును పంపుతుంది.
UDID కార్డు వికల్య శాతమును బట్టి మంజూరు చేయబడును:
  1. వైట్ కార్డు          :  పిడబ్ల్యుడి వైకల్యం శాతం 40% కంటే తక్కువగా ఉన్నప్పుడు జారీ చేయబడుతుంది.
  2. పసుపు కార్డు     : పిడబ్ల్యుడి వైకల్యం శాతం 40% పైన కానీ 79% వరకు ఉన్నప్పుడు.
  3. బ్లూ కార్డు           : పిడబ్ల్యుడి వైకల్యం శాతం 80% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు.

UDID కార్డు గురించి తరచుగా అడిగే ప్రశ్నల సమాధానము కొరకు క్లిక్ చేయండి 👉 FAQ

సంప్రదించు చిరునామా:
డైరెక్టర్,
వికలాంగుల సాధికారత విభాగం, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, గది నెం. 517, B-II బ్లాక్, అంత్యోదయ భవన్, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ - 110003 (భారతదేశం)

మొబైల్ నెం :  91-11-2436 5019
ఈ మెయిల్  :  disability-udid@gov.in

4 కామెంట్‌లు:

  1. Thank you so much madam. Mee reply chadivaanu madam. Mee maatalu, guidance naaku chaala encouraging gaa unnaye. Mee nundi naynu chaalaa nayrchukovaali. Nannu naynu maarchukovadanekay prayatnestunna madam

    రిప్లయితొలగించండి
  2. E blog dwaraa naku teliyani kotha vishayalu telisayi. Thank you madam. Mee guidance kuda chaalaa meaningful gaa untundi. Manasikanga naligipotunna vikalangulaku meroka good counselor madam. The way you guide is very good.

    రిప్లయితొలగించండి